Maddela Cheruvu Suri Murder Case Accused Bhanu Kiran Released:హైదరాబాద్‌లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్ బెయిల్పై విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలులో భాను కిరణ్ సుమారు 12 ఏళ్ల పాటు ఉన్నాడు. సీఐడీ అమ్స్ యాక్ట్ కేసులో భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
2011 జనవరి 4వ తేదీన మద్దెల చెరువు సూరి భాను కిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లోని సనత్ నగర్లో భానుకిరణ్ మద్దెల చెరువు సూరిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అప్పట్లో ఈ మర్డర్ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, మొద్దు శీను, భాను కిరణ్ పేర్లు ఓ రక్త చరిత్రను తలపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.