Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తున్న ఫొటోలు, దృశ్యాలు, అటవీ శాఖ ట్రాప్ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. దీంతో చిరుత కదలికలపై మరింత నిఘా పెంచారు. చిరుత సంచరిస్తున్న శివారు ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే సంచారం : రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారి- 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. శుక్రవారం (Sep 6) తెల్లవారుజామున నోటిలో ఓ జంతువుని పట్టుకోని చిరుత జాతీయ రహదారి దాటుతోందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి, ప్రసారభారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫొటో రికార్డయింది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్థారించారు
రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - Cheetah in East GodavariCheetah in East
36 ట్రాప్ కెమెరాలు : చిరుత కదలిలకపై మరింత నిఘా పెట్టిన అటవీ సిబ్బంది 36 ట్రాప్ కెమెరాలు అమర్చారు. రెండు బోన్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర అటవీ శిక్షణా కేంద్రం, మొక్కల పరిశోధన కేంద్రం, పుష్కర నగర వనం పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 920 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. అలాగే వివిధ రకాల ఉద్యాన వనాలు, తోటలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఈ పరిసరాల్లోనే తిష్టవేసింది. స్వరూప్ నగర్, రూపా నగర్, ఫాతిమా నగర్, హౌసింగ్ బోర్డ్, పద్మావతి నగర్, శ్రీరాపురం, దివాన్ చెరువు ప్రాంతాల వాసులు సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. చిరుత సంచారంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
శ్రీశైలంలో కుక్కను ఎత్తుకుపోయిన చిరుత - నివాస స్థలాల్లోకి ప్రవేశించడంతో భయాందోళన
చిరుత జాడ కోసం గాలింపు : చిరుతకి నాలుగేళ్ల వయస్సు ఉంటుందని అటవీ అధికారులు నిర్థారణకు వచ్చారు. ఎక్కడి నుంచైనా వచ్చిందా లేక స్థానికంగానే ఉందా అన్నది తేలాల్సి ఉంది. చిరుత వచ్చిన దారిలో తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం శివారులో చిరుత జాడ కోసం అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పాదముద్రల కోసం వెతుకుతున్నారు. చిరుత జాడ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
నంద్యాలలో మహిళను చంపిన చిరుత బోనుకు చిక్కింది - Leopard Caught in Pacharla