Leaders Took Charge as Corporation Chair Persons:కార్పొరేషన్ ఛైర్మన్లుగా కొంతమంది నేతలు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి ప్రమాణ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఛైర్మన్లను అభినందించి శాలువాతో సత్కరించారు.
APSRTC Chairman Konakalla Narayana:ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. కొనకళ్లకు మంత్రులు, పార్టీ నేతలు, సినీ నటుడు సుమన్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదు ప్రజా సంస్థ అని కొనకళ్ల వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా అలాగే నడుపుతున్నారే తప్ప ప్రయాణికులపై భారం వేయడం లేదన్నారు. కొత్తగా ఎలక్ట్రిక్ బస్లు తీసుకు వస్తామని తెలిపారు.
కార్పొరేషన్ ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన నేతలు (ETV Bharat) Maritime Board Chairman:మారిటైం బోర్డు ఛైర్మన్‌గా దామచర్ల సత్య బాధ్యతలు చేపట్టారు. బందరు పోర్టు, రామాయపట్నం పోర్టులను వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మత్స్యకారులకు మేలు జరిగేలా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మారిటైం బోర్డు ద్వారా కృషి చేస్తానని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలిపారు.
Markfed Chairman Karrotu Bangarraju:విజయవాడలో మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజు బాధ్యతలు తీసుకున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఈ సందర్భంగా బంగార్రాజు హామీ ఇచ్చారు.
మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే - AP liquor shops application process
AP Seed Development Corporation Chairman:ఏపీ విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులసమస్యలపై అవగాహన ఉందని ఈ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానని సుబ్బారెడ్డి చెప్పారు. రైతులకు మేలు చేసేలా చర్యలు చేపడతామని గత ఐదేళ్లుగా రైతులు కష్టపడ్డారని, వారిని ఇప్పుడు ఆదుకుంటామని చెప్పారు.
Tourism Development Corporation Chairman:పర్యాటకంగా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు. విజయవాడ టూరిజం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఐదేళ్లలో దేశంలోనే రాష్ట్రం టూరిజంలో మెదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు.
APIIC Chairman Mantena Ramaraj :మంగళగిరి ఏపీఐఐసీ(APIIC) భవన్‌లో ఛైర్మన్‌గా మంతెన రామరాజు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని రామరాజు చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహకారంతో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
వైఎస్సార్సీపీ హయాంలో 'చెత్త' ప్రాజెక్టుకు తూట్లు - పనులు చేయకుండానే బిల్లులు - People Suffering to Dumping yard
జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరి - పూర్తి కాని గుంటూరు ఛానల్ పనులు - Guntur Channel Extension Works