Swearing-in ceremony: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎం లు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అటు అభిమానులు సైతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. సామాన్య కార్యకర్తలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారికి తగిన విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా వీఐపీ, వీవీఐపీల గ్యాలరీలకు మాత్రం పరిమిత సంఖ్యలో పాస్‌లను జారీ చేశారు.
ఇక నియోజకవర్గానికి కేవలం 200 చొప్పున పాస్‌లు జారీ చేశారు. పాస్‌లను పరిమిత సంఖ్యలో జారీ చేసిన నేపథ్యంలో అటు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాస్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలిసిన నేతల ద్వారా పాస్‌లు దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని నియోజకవర్గాని 200 వందల పాస్‌లు మాత్రమే జారీ చేశారనే విషయం తెలియని కూటమి నేతలు, పాస్‌ల కోసం నియోజకవర్గాల్లోని నేతల చుట్టూ తిరుగుతున్నారు. వారి ద్వారా పాస్‌లు పొందవచ్చని ప్రయత్నాలు చేస్తున్నారు.
'గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం'- పవన్ ప్రతిపాదనకు కూటమి ఏకగ్రీవ ఆమోదం - Chandrababu as CM candidate
కూటమి నేతలకు పాస్‌లు సరిపడా ఇవ్వలేక ముఖ్య నాయకులు తల పట్టుకుంటున్నారు. నియోజకవర్గానికి 200 మందికి (టీడీపీ+జనసేన+బీజేపీ) మాత్రమే పాస్ లు మంజూరు చేశారు. ఈ సమాచారం నిజమో కాదో తెలియక అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. అభిమాన సందోహం భారీగా హాజరైతే ప్రమాణ స్వీకార ప్రాంగణం సరిపోయే పరిస్థితి లేదని కూటమి నేతలు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.
పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇవ్వడంతో కూటమి నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడటానికి టీవీలకే పరిమితమవ్వాలా? ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, మరికొన్ని చోట్ల మాత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమను తీసుకెళ్ళాలని నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కార్యకర్తల ఒత్తిడితో ఏం చేయాలో తెలియక ముఖ్య నేతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. 200 పాస్‌ల కోసం ముఖ్య నేతలు సర్దుబాటు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, పార్లమెంట్ కమిటీ, మరి ముఖ్యంగా పార్టీ కోసం కృషి చేసిన ఐటీడీపీ ఒక్క పాస్‌లు ఇవ్వలేదని ఆయా కమిటీ మెంబర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ నేతలకు గవర్నర్ ఆహ్వానం- సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం - NDA Leaders meet governor