Police Seized 671 KG Ganja In Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా పాచి పెంట ఎస్సై వెంకటసురేశ్ తన సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణా గురించి వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా 671 కేజీలు గంజాయి లభ్యమైంది. వివిధ బృందాలుగా విభజించి మాతమూరు గ్రామ కూడలి వద్ద మరియు వేటగాని వలస జంక్షన్ వద్ద ఉదయం 6 గంటల నుంచి వాహన తనిఖీలు నిర్వహించగా ఈ గంజాయి బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు.
కోటి రూపాయల విలువైన గంజాయి:అరకు వైపు నుంచి సాలూరు వైపు వస్తున్న రెండు బొలెరో వాహనాలను పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. పోలీసులను చూసి భయపడిన వాహన డ్రైవర్లు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సై వారి సిబ్బంది వారి వెంట వెంబడించి రెండు వాహనాలతో సహా ఆరుగురు నిందితులను పట్టుకొని వాహనముల తనిఖీ చేశారు. వాహనాల్లో 300 ప్యాకెట్స్ లో ఉన్న 671 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వారి వద్ద నుంచి 6సెల్ ఫోన్లన సీజ్ చేశారు. ఈ గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారైన పడవు గ్రామ నివాసైన కిసాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి విలువ 80 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు ఉంటుందని మన్యం ఎస్పీ మాధవ రెడ్డి వెల్లడించారు.
Police Seized 398 KG Ganja In Alluri District:మరో ఘటనలో అల్లూరి జిల్లా మీదుగా తరలిస్తున్న 398 కిలోల భారీ మొత్తంలో లో ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి పెదబయలు మండలం పన్నెడ జంక్షన్ మీదుగా పాడేరు వైపు జీపులో గంజాయి తరలిస్తుండగా ఎస్సై రమణ బృందం పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో అల్లూరి జిల్లాకు చెందిన ఒకరిని, తిరుపతి జిల్లాకు చెందిన మరొ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి రవాణపై ప్రభుత్వం కఠినంగా ఉందని గంజాయి నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టే అవకాశం లేదని ఎస్సై రమణ హెచ్చరించారు.