ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు క'న్నీరు' - లంక భూముల్లో కుళ్లిన పంటలు - Lanka villages farmers problems

Lanka Villages Farmers Suffered Badly Due to Heavy Rains : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. వృద్ధ గౌతమి, గోదావరి నది పాయలు ప్రమాద స్థాయిలో ప్రవహించి జిల్లాలో వేలాది ఎకరాల్లోని లంక భూముల్లో పంటను ముంచెత్తాయి. మునగ, బెండ, వంగ, మిరప, ఆనప, బీరకాయ తోటలు పది రోజులుగా వరద నీటిలోనే మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. పశువులకు గ్రాసం కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

Lanka Villages Farmers Suffered Badly Due to Heavy Rains
Lanka Villages Farmers Suffered Badly Due to Heavy Rains (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 4:31 PM IST

Lanka Villages Farmers Suffered Badly Due to Heavy Rains : కోనసీమ జిల్లాలో కురిసిన ఎడతెరపిలేని వర్షాలకు లంక గ్రామల్లోని ప్రజలు నేటికి కోలుకోలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీటి ప్రవాహం పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. దీంతో వృద్ధ గౌతమి, గోదావరి నది పాయలు ప్రమాద స్థాయిలో ప్రవహించి జిల్లాలో వేలాది ఎకరాల్లోని లంక భూములను ముంచెత్తింది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో లంక భూముల్లో పంటలు కుళ్లిపోయి పైకి తేలుతున్నాయి. ముమ్మిడివరం నియోజవర్గ పరిధిలోని నాలుగు మండలాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వర్షాలకు అస్తవ్యస్తమైన గిరిజనుల జనజీవనం - వాగులు దాటేందుకు అవస్థలు - Tribals Suffering to Rains

కుళ్లిపోయిన పంటలు :డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని లంక భూముల్లో మెట్ట పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కువగా గురజాపులంక, తానేలంక, పొట్టిలంక, కూనలంక, చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన రైతులు రైతులు ఎకర, అరెకరా భూముల్లో పండించిన మునగ, బెండ, వంగ, మిరప, ఆనప, బీరకాయ తోటలు పది రోజులుగా వరద నీటిలోనే మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో వరదపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

"భారీ వర్షాల కారణంగా సూద కొబ్బరి మొక్కలు, అరటి పిలకల తోటల్లో వరద నీరు ఇంకా దిగకపోవడంతో మొదళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎకరాకు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టాము. లంక భూములు ఇప్పటికి బురదతో ఉండిపోవడంతో పశువులన్నీ గ్రామంలోని ప్రధాన రహదారి పైనే ఉంచాల్సి వస్తోంది. పచ్చి పశుగ్రాసం కూడా లేకపోవడంతో ఎండు గడ్డి, మొక్కజొన్న పొత్తులరేకలను అందిస్తున్నాము. దీంతో పాల దిగుబడి సగం వరకు పడిపోయింది. ప్రభుత్వం అందించిన దానా ఒకటి రెండు రోజులు మించి సరిపోవడం లేదు." - రైతులు

చుట్టూ నీరు - మధ్యలో ఊరు :పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక గ్రామం వశిష్ఠ గోదావరి నది మధ్యలో ఉంది. ఇక్కడ సుమారు నాలుగు వేల మంది జనాభా నివశిస్తున్నారు. వీరంతా నిత్యం వివిధ పనుల నిమిత్తం కోనసీమ జిల్లాలోని చాకలిపాలెంకి వెళ్తుంటారు. రాకపోకలకు సాగించేందుకు వీలుగా అక్కడి నదిపై కాజ్‌వే ఉంది. అయితే కాజ్‌వే ప్రస్తుతం గోదావరి ముంపులో కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం గత 15 రోజుల నుంచి మర బోట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడి గోదావరి ప్రవాహానికి ఎత్తుగా కాజ్‌వే నిర్మించాలని స్థానికులు ఎన్ని సార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని వాపోయారు.

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods

కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గోదావరి వరద- నీళ్లలో నానుతున్న ఇళ్లు, పొలాలు - heavy rains in Konaseema

ABOUT THE AUTHOR

...view details