ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"స్వర్ణముఖి" ఉగ్రరూపం - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు - విరిగిపడిన కొండచరియలు

landslides_on_second_ghat_road_from_tirupati_to_tirumala
landslides_on_second_ghat_road_from_tirupati_to_tirumala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 3:31 PM IST

Updated : Dec 3, 2024, 3:52 PM IST

Landslides on Second Ghat Road from Tirupati to Tirumala :తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులోని కొండలు తడిసి ముద్దయ్యాయి. దీంతో అక్కడక్కడ కొండచరియలు జారిపడుతున్నాయి. 12వ కిలో మీటరు వద్ద స్వల్పంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు సిబ్బంది ట్రాఫిక్​ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తుండటం వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతుండటంతో స్వర్ణముఖి నదిలో ప్రవాహ ఉద్ధృతి గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం 13,200 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. చెంబేడు కాల్వకు నీటి విడుదల నిలిపేశారు. వర్షాల కారణంగా అక్కడి చెరువులన్నీ పూర్తిగా నిండిపోవడంతో చెంబేడు కాల్వకు నీటిని నిలుపుదల చేశారు. రాత్రికి మరింతగా ప్రవాహం పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. స్వర్ణముఖి ప్రవాహాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. చెరువుల పరిస్థితిపై తెలుగుగంగ ఎస్‌ఈ, జలవనరుల శాఖ ఈఈ మదనగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, డీఈ ఆదినారాయణ పాల్గొన్నారు.

Last Updated : Dec 3, 2024, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details