Illegal activities of Usha Sri Charan : రాష్ట్రంలో దేన్నీ వదిలిపెట్టకుంటా వైఎస్సార్సీ సారథి తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మరీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. యతా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ పార్టీ నేతలు కబ్జాల పర్వానికి తెర లేపారు. వాళ్ల కన్ను పడ్డ ప్రతీదీ ఖాతాలో పడాల్సిందే అన్నట్లు యథేచ్ఛగా దోచుకున్నారు. మంత్రులు, ముఖ్య నేతల అండతో ఎన్నో అరాచకాలు సాగించారు. అయితే మంత్రి ఉష శ్రీ చరణ్ భర్త సొంత మేన మామ ఇంటి తన పేరుమీదకు మర్చుకుని వారి కుటుంబాన్ని రోడ్డున పడేశాడని బాధితులు వాపోయారు.
Minister Usha sri Charan Couple Cheated Their Own Uncle :పెనుకొండ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి ఉష శ్రీ చరణ్ దంపతుల అక్రమాలకు అడ్డూఅదుపు లేదు. వారి కన్ను పడిదంటే చాలు బంధువుల భూమైనా పరాయివాళ్లదైనా ఆక్రమించాల్సిందే. బెంగళూరులోని సింగనాయకనహల్లిలో ఉష శ్రీ చరణ్ దంపతుల భూ కబ్జా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నప్పటినుంచి ఆలనా పాలనా చూసిన సొంత మేనమామనే మోసం చేశారు ఉష శ్రీ దంపతులు. చరణ్ రెడ్డి మేనమామ జగన్నాథం రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సొంతిళ్లు కట్టుకున్నారు.
మంత్రి ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ - పార్టీ మారేందుకు సిద్ధమని కార్యకర్తల హెచ్చరిక