Key Files Missing in Ponnuru MRO Office :రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వివిధ శాఖలు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోవడం, చెత్తకుప్పలో కనిపించడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న స్థానిక కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి.
Documents Missing in Ponnuru :గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) పేరుతో నామకరణం చేశారు.
గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office
సీఐడీ అధికారులు విచారణ :కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు.