ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం - KAISIKA DWADASHI CELEBRATIONS

శ్రీదేవి, భూదేవి సమేత మాడవీధుల్లో ఊరేగిన ఉగ్రశ్రీనివాసమూర్తి

KAISIKA_DWADASHI_CELEBRATIONS
KAISIKA_DWADASHI_CELEBRATIONS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 2:04 PM IST


Kaisika Dwadashi Celebrations in Tirumala Srivari Temple : తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానంను టీటీడీ వైభవంగా నిర్వహించింది. బుధవారం వేకువజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలి వద్ద వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఏడాదిలో కైశిక ద్వాదశి పర్వదినం రోజునే సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details