ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 8:35 PM IST

ETV Bharat / state

షిరిడీలో 41 జంటలకు సామూహిక వివాహాలు - 24 ఏళ్లుగా జరిపిస్తున్న కోటే దంపతులు - 41 Couple Marriage in Shirdi

41 Couple Marriage in Shirdi : తమకు కుమార్తె లేకపోవడంతో ఎంతోమంది అమ్మాయిల వివాహాలు షిరిడీకి చెందిన దంపతులు స్వయంగా జరిపిస్తున్నారు. గత 24 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 41 మంది జంటలకు కల్యాణం జరిపించగా ఇప్పటివరకు ఆ సంఖ్య 2,250కి చేరింది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం.

Shri Saisiddhi Charitable Trust
Shri Saisiddhi Charitable Trust (Etv Bharat)

షిరిడీలో 41 జంటలకు సామూహిక వివాహాలు - 24 ఏళ్లుగా జరిపిస్తున్న కోటే దంపతులు (ETV BHARAT)

41 Couple Marriage in Shirdi :షిరిడీలో వేలాది మంది వధూవరుల సాక్షిగా శుభ వాతావరణంలో 41 మంది జంటలు ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. షిరిడీలోని కైలాస్‌బాపు కోటే దంపతులు గత 24 సంవత్సరాలుగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ప్రతి సంవత్సరం సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 2250 మంది ఆడపిల్లలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు సాధారణ కుటుంబాలకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు.

పెళ్లికొడుకు గుర్రంపై స్వారీ చేసే కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అందరూ ఎంతో ఆనందంతో నృత్యాలు చేశారు. తండ్రి తన కుమార్తె పెళ్లి చేయడానికి ఎంత ఆందోళన చెందుతారు. కానీ అలాంటి వారందరికీ షిరిడీకి చెందిన కైలాస్‌బాపు కోటే విలువైన సహకారం అందించారు. ఒకరిద్దరు కాదు, గత 24 ఏళ్ల నుంచి 2250 మంది ఆడపిల్లలను తన సొంత ఖర్చులతో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కైలాస్‌బాపు ప్రతి సంవత్సరం అన్ని మతాల వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణ, పటాకులు, ఆడబిడ్డకు కావాల్సిన అన్ని సామగ్రి, బంగారు మంగళసూత్రంతో కూడిన ఆడంబరాలు అన్నీ ఆ దంపతులే చేయిస్తారు. తమకు కుమార్తె లేకపోయినా సుమిత్రా కోటే 2250 మందికి తల్లయ్యింది. వారికి కుమార్తె లేనందున ఇలాంటి వివాహ వేడుకలు నిర్వహిస్తూ ఎంతోమంది తల్లిదండ్రులను ఆదుకుంటున్నారు.

షిర్డీ సాయి మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు - భారీగా హాజరైన భక్తులు - Sri Rama Navami Celebrations Shirdi

సుమిత్రా కోటే స్వయంగా పెళ్లికి అన్ని సన్నాహాలు చేశారు. ఈ వ్యవహారం రెండు నెలల ముందు ప్రారంభమవుతుంది. అమ్మాయిల చీరలు, మేకప్, గృహోపకరణాలు స్వయంగా కొనుగోలు చేస్తారు. తమ కుమార్తె పెళ్లి అన్నట్టుగా చేస్తుంటారు. ఏ తండ్రి కూడా తన కుమార్తె పెళ్లి భారంగా భావించకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఈ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా 'భేటీ బచావో బేటీ పడావో', 'ఆడ భ్రూణహత్యలను నివారించండి', 'కట్నం తీసుకోవద్దు, ఇవ్వవద్దు' అనే సందేశం ఈ వివాహాల ద్వారా చాటి చెప్తున్నారు.

సాయి సంస్థాన్‌కు విరాళంగా 23 లక్షల 50 వేల డయాలసిస్​ యంత్రాలు - Shirdi Sai Baba Devotee donation

శ్రీ సాయిసిద్ధి ఛారిటబుల్ ట్రస్ట్, షిరిడీ గ్రామస్థుల సహకారంతో సర్వమత సమాజ కార్యక్రమాన్ని కేవలం రూపాయితో ప్రారంభించారు. ఏ తండ్రైనా కుమార్తె పెళ్లి భారం వల్ల అప్పుల పాలవుతారు. అందుచేత ఈ కళ్యాణ మహోత్సవం పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఊహించిన దాని కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం ద్వారా వధూవరులు చాలా సంతోషపడతారు. పెళ్లికి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం కంటే మన పిల్లల చదువులకే ఖర్చు పెట్టాలని, సమాజంలో ఇలాంటి పనులు చేస్తే కుమార్తె పెళ్లి భారం కాదని, ఏ తండ్రీ ఆత్మహత్య చేసుకోడని ఈ విధంగా చేస్తున్నట్లు దంపతులు తెలిపారు. కుమార్తె పెళ్లి గురించి ఆందోళన చెందుతున్న చాలా మంది తండ్రులకు ఈ వివాహ వేడుక ఆసరాగా ఉంటుందని తాము భావిస్తున్నామని అన్నారు.

అమ్మవారికి అలంకరించిన 30 తులాల బంగారం 100 తులాల వెండి 40 లక్షల నగదు చోరీ

షిర్డీ ఆలయంపై టోర్నా ప్రతిష్ఠాపన- ఘనంగా మరాఠీ నూతన సంవత్సర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details