Kadapa Court No One Talks Viveka Murder Case :వివేకా హత్య కేసు అంశంపై ఈ నెల 30వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టులో వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా వివేకా హత్య కేసుపై పలువురు రాజకీయ నాయకులు ప్రచారంలో మాట్లాడుతున్నారని సురేష్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధానంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని పిటిషన్ వేయగా వారందరూ ఈనెల 30వ తేదీ వరకు వివేకా అంశాన్ని ప్రస్తావించవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
వివేకా హత్యలో భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకమైంది: సీబీఐ - Vivekananda Reddy Murder Case
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వివేకానంద హత్య కేసులో తన పాత్రపై పలువురు వ్యాఖ్యలు చేస్తూ హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. దస్తగిరి తమకు సమర్పించిన వినతిపై తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ విచారణను ఈనెల 23కి వాయిదా వేశారు.