JubileeHills Hit and Run Case :హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 వద్ద బుధవారం తెల్లవారుజామున కారు బైక్‌ను ఢీ కొన్న ఘటనలో ఓ హోటల్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న తారక్‌రామ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. ఉస్మానియాలో పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చి, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి గంటల తరబడి ఆందోళన చేపట్టారు.
Five People Arrested in JubileeHills Hit and Run Case : తారక్‌రామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతని బంధువులు, బౌన్సర్లు నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇచ్చినప్పటికీ వారు అక్కడ నుంచి కదలకుండా ధర్నా నిర్వహించారు. కారు ప్రమాదానికి (Car Accident Jubilee Hills) కారణమైన వ్యక్తిని కాకుండా పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న కారును కాకుండా మరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని వారు నినాదాలు చేశారు.
మద్యం మత్తులో ఒకరిని బలి తీసుకున్న జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్
Bouncer Died in Hit and Run Case Hyderabad : తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళకారులు స్పష్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల అదనపు డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ మృతుడి కుటుంబసభ్యులకు సర్దిచెప్పారు. నిందితుడి శిక్ష పడేలా చేస్తామని తారక్‌రామ్ కుటుంబ సభ్యులకు వారు హామీ ఇచ్చారు.
Hit and Run Case in Hyderabad : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రమాదం జరిగినప్పుడు (JubileeHills Hit and Run Case) కారులో నలుగురు యువకులు, యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన కారును ఎస్ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మరోవైపు ఈ ఘటనలో తారక్‌రామ్ మృతి చెందగా, మరో బౌన్సర్ రాజుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.