తెలంగాణ

telangana

ETV Bharat / state

హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​లో ఉద్యోగాలు - ఎవరెవరు అర్హులంటే - JOB OPPORTUNITIES IN HAL

హిందుస్థాన్​ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన - 57 డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్ నాన్​ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

JOB Opportunities In HAL
JOB Opportunities In HAL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 4:26 PM IST

JOB Opportunities In HAL :హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) 57 డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 4 ఏళ్ల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌కు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 57

మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌ విభాగానికి 25, ఈడబ్ల్యూఎస్‌కు 6, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 16, షెడ్యూల్డ్​ క్యాస్ట్(ఎస్సీ) 7, ఎస్టీలకు 3 కేటాయించారు. డిప్లొమా టెక్నీషియన్‌ (మెకానికల్‌)-10, డిప్లొమా టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌)-5, డిప్లొమా టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌)-35, డిప్లొమా టెక్నీషియన్‌ (కెమికల్‌)-1, ఆపరేటర్‌ (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)-2, ఆపరేటర్‌ (ఫిట్టర్‌)-1, ఆపరేటర్‌ (పెయింటర్‌)-2, ఆపరేటర్‌ (టర్నర్‌)-1 ఖాళీలు ఉన్నాయి.

  1. డిప్లొమా టెక్నీషియన్‌ ఉద్యోగాలకు (మెకానికల్‌)-10 : మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఫుల్‌టైమ్, రెగ్యులర్‌ డిప్లొమా/ 10+3 విధానంలో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్​ను పూర్తిచేసుండాలి.
  2. డిప్లొమా టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌)-5: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా/ 10+3 విధానంలో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేయాలి.
  3. డిప్లొమా టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌)-35: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఫుల్‌టైమ్, రెగ్యులర్‌ డిప్లొమా/ 10+3 విధానంలో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేయాలి.
  4. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎస్టీలకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  5. అప్లికేషన్ ఫీజు: రూ.200. ఎస్టీ, ఎస్సీ దివ్యాంగులు, హాల్‌(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​లో) పనిచేసిన మాజీ అప్రెంటిస్‌ ట్రెయినీలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం :రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ వివరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను రాత రీక్షకు ఎంపిక చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్​ను అభ్యర్థుల ఈ-మెయిల్‌కు తెలియజేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతారు. రాత పరీక్ష వివరాలను తెలియజేసే ఈ-అడ్మిట్‌ కార్డ్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో జనరల్‌ అవేర్‌నెస్‌-20 ప్రశ్నలు ఉంటాయి, పార్ట్‌-2లో ఇంగ్లిష్‌-రీజనింగ్‌-40 ప్రశ్నలు ఉండగా, పార్ట్‌-3లో సబ్జెక్టు సంబంధిత 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. నెగటివ్‌ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్​లో అర్హత సాధించినవారిని ప్రాథమికంగా సెలక్ట్​ చేసి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. అర్హత పొందినవారిని తుది ఎంపిక చేయనున్నారు.

సన్నద్ధత: సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలకు 100 మార్కులును కేటాయించారు. కాబట్టి ముఖ్యాంశాలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

  • జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్‌, ఇంగ్లీష్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలు తోడ్పడతాయి. వీటిని రోజూ సాధన చేయడం వల్ల మంచి ఫలతాన్నిస్తుంది.
  • బలహీనంగా ఉన్న సబ్జెక్ట్​(అంశాలకు)అదనపు సమయాన్ని కేటాయించాలి.
  • రాత పరీక్షకు మరి అంత ఎక్కువ సమయం లేదు. కనుక ఇప్పటినుంచీ టైమ్‌టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా పాటిస్తూ సన్నద్ధం కావాలి.
  • నెగటివ్‌ మార్కులు లేవు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వేతనం : డిప్లొమా టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ప్రారంభ వేతనం నెలకు రూ.23,000. ఆపరేటర్‌ పోస్టులకు నెలకు రూ.22,000 జీతం ఉంటుంది

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారిని హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.

  • దరఖాస్తుకు చివరి తేదీ: 24.11.2024
  • రాత పరీక్ష తేదీ: 22.12.2024
  • అధికారిక వెబ్​సైట్ : www.hal-india.co.in

ఐటీఐ అర్హతతో - HALలో 324 ఉద్యోగాలు - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​! - HAL Recruitment 2024

HAL Apprentice jobs : డిప్లొమా, ఐటీఐ అర్హతతో అప్రెంటీస్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details