ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టెక్నికల్​గా దొరికిపోయారుగా!- సినీనటి ఫోన్​లోకి ఆ ముగ్గురు ఐపీఎస్​ల చొరబాటు - Jethwani Icloud Account Was Hacked

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Jethwani Icloud Account Was Hacked : ముంబయి సినీనటి ఫిర్యాదుతో జేఎస్​డబ్లూ గ్రూపు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌పై ముంబయి పోలీసులు పెట్టిన అత్యాచారం కేసు ఆధారాల ధ్వంసానికి ఐపీఎస్‌ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా వెల్లడైపోయింది. కేసు విచారణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని బాధితురాలు కోరారు.

jethwani_icloud_account_was_hacked
jethwani_icloud_account_was_hacked (ETV Bharat)

Jethwani Icloud Account Was Hacked :పారిశ్రామికవేత్త జిందాల్‌పై నమోదైన కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఐపీఎస్ అధికారులు ప్రయత్నించారని ముంబయి నటి ఫిర్యాదుతో వెల్లడైంది. నటి జెత్వానీ యాపిల్‌ ఐడీ ఉపయోగించి ‘ఐక్లౌడ్‌’లోకి చొరబడ్డారు. ఆమె ‘‘ఐ ఫోన్‌’ యాక్సెస్‌ పొందారు. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 5 గంటల 53 నిమిషాల సమయంలో ఒకసారి, ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల 47 నిమిషాల సమయంలో మరోసారి యాపిల్‌ ఐడీ ఉపయోగించి ఐ క్లౌడ్‌లోకి సైన్‌ ఇన్‌ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీ కేవలం 4 నిమిషాల వ్యవధిలో మొత్తం 6 సార్లు ఆమె యాపిల్‌ ఐడీకి అనేక రకాలు మార్పులు చేసేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలు అధికారిక హోదాను దుర్వినియోగం చేసి, ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ముంబయి నటి తాజాగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఫిబ్రవరి 3న అరెస్టైన ముంబయి నటి, ఆమె తల్లిదండ్రులు మార్చి 15న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత నటి తనకు వచ్చిన మెయిల్స్‌ అన్నీ చెక్‌ చేసుకున్నారు. ‘‘మీ యాపిల్‌ ఐడీ ఉపయోగించి ఐ క్లౌడ్‌లోకి వెబ్‌బ్రౌజర్‌ ద్వారా సైన్‌ ఇన్‌ అయ్యారు. అది మీరు కాకపోతే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.’’ అంటూ ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 21వ తేదీల్లో యాపిల్‌ సంస్థ నుంచి ముంబయి నటికి వేర్వేరుగా మెయిల్స్‌ వచ్చాయి. ‘‘మీ యాపిల్‌ ఐడీలో అనేక మార్పులు చేశారు. అది మీరు కాకపోతే వెంటనే అప్రమత్తమవ్వండి.’’ అని పేర్కొంటూ ఫిబ్రవరి 21వ తేదీన ఆమెకు యాపిల్‌ సంస్థ నుంచి ఆరు మెయిల్స్‌ అందాయి. వీటన్నింటినీ పరిశీలించిన ఆమె తన ‘‘ఐ క్లౌడ్‌’’లోని ఆధారాలు ధ్వంసం చేసేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, అప్పటి విజయవాడ పోలీసులు ప్రయత్నించినట్లు గుర్తించారు.

ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు: ముంబయి నటి - Mumbai Actress Meet Home Minister

ఏప్రిల్, మే నెలల్లో తన పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకున్నారు. హీరోయిన్​ని ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడలోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అయిదు రోజులు పాటు ఆమెను ఉంచి విచారించారు. అప్పుడు కూడా పోలీసులు ఆ ఫోన్‌లు ఓపెన్‌ చేయాలని, ఐక్లౌడ్‌లోకి సైన్‌ ఇన్‌ అవ్వాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అందులో ఉన్న ఆధారాల్ని ధ్వంసం చేయాలని చూశారు. అందుకు ఆమె నిరాకరించటంతో కస్టడీ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఆమె యాపిల్‌ ఐడీ ఉపయోగించి ఐ క్లౌడ్‌లోకి సైన్‌ ఇన్‌ అయ్యారు.

యాపిల్‌ ఐడీలో మార్పులు చేశారు. హీరోయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్లను ఎక్కడ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నించారు? యాపిల్‌ ఐడీతో సైన్‌ ఇన్‌ అయ్యాక ఏమేం మార్పులు చేశారు? ఎలాంటి మార్పులు చేశారు? అనే దానిపై సమగ్ర వివరాలు సమర్పించాలని కోరుతూ యాపిల్‌ సంస్థకు లేఖ రాశామని నటి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తెలిపారు.

ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సీఐ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈకేసులో డీజీ, ఐజీ ,డీఐజీ స్థాయి అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీఐ అధికారి దర్యాప్తు చేయటం సాధ్యపడదని పిటీషనర్ తరపు న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జెత్వానీ ఐఫోన్లలో ఆధారాలు చెరిపేందుకు విఫలయత్నం - వెలుగులోకి పీఎస్​ఆర్​ అరాచకాలు - Kadambari Jethwani Case Updates

ABOUT THE AUTHOR

...view details