Jagananna House Registration Problems In Guntur District :జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్, బయోమెట్రిక్ డివైజ్‌లు సక్రమంగా పనిచేయక రిజిస్ట్రేషన్లు (House Registration) మందకోడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నద్ధత లేకుండానే ఈ ప్రక్రియను చేపట్టడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల రిజిస్టేషన్ల కోసం రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నామని మహిళలు వాపోతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు
Jagananna House Registration Problems :జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందిన వారికి హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అయితే గుంటూరు జిల్లాలో తొలి రోజు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. పేరేచర్లలోని గ్రామ సచివాలయాల్లో అడుగడుగునా సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ కూలీలైన మహిళలు పనులు మానుకోని సచివాలయాలకు వస్తున్నారు. అయినా (Jagananna House) రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ విభేదాలతో ఆగిన జగనన్న ఇళ్ల స్థలాల పంపీణీ - నిరుపయోగంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం