Jagan Cheated Guntur People by Giving False Promises:2022 నవంబర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజు గుంటూరు వచ్చి సీఎం జగన్ రకరకాల హామీలు ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ పనులకు 287 కోట్ల నిధులిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. గుంతలు పడిన రోడ్లు పూడ్చటానికి కార్పొరేషన్ నిధులే ఉపయోగించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన యూజీడీ పనులు తప్ప ఆ తర్వాత ఒక్కటీ చేపట్టలేదు. బిల్లులు రాలేదని షాపూజీ పల్లోంజి సంస్థ పనులు నిలిపేసి వెళ్లిపోయింది. పనులు పూర్తి కాక గుంటూరు నగరంలో 4 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికీ ఇంటింటికీ సెప్టెక్ ట్యాంకులు పెట్టుకుని డ్రైనేజీ నీటిని అందులోకి వదులుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. డ్రైనేజీ సరిగా లేని కారణంగా పైపులైన్లు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితం అవుతోంది. ఇటీవల కలుషిత నీరు తాగి డయేరియాతో నగరంలో నలుగురు చనిపోయి, వందలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేతగా వచ్చిన సమయంలో గుంటూరుని గ్రేటర్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే లేదు. గ్రేటర్‌గా మార్చటం అటుంచితే నగరపాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల్లో తాగునీరు, అప్రోచ్ రోడ్డు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం సమస్యలు పరిష్కరించలేదు. జగన్ ఇచ్చే మాటA నీటిమూటలేనని నగరవాసులు మండిపడుతున్నారు.
వేల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు - వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారి కుట్ర - Fake Votes Registration
అసైన్డ్ రైతులకు సమాన ప్యాకేజీ ఇస్తామంటూ జగన్ ఊదరగొట్టారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు నమ్మినట్లే రాజధాని రెండు నియోజకవర్గాల ప్రజలు జగన్ మాట నమ్మారు. తాడికొండ, మంగళగిరిలో వైకాపా అభ్యర్థులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని విధ్వంసం చేశారు. రైతులను కేసులు పెట్టి వేధించారు. భూములేని రైతుకూలీలకు ఎన్నికల్లో లబ్ధి ఎత్తుగడతో కోడ్ వచ్చేందుకు నెల ముందు 5 వేలకు పింఛను పెంచారు. అమరావతిని నాశనం చేసే క్రమంలో మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని మంగళగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.