Minister Nimmala Rama Naidu On Polavaram Project : 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చుతామని జవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 70 శాతం పూర్తయిన పోలవరం పనులను గత ప్రభుత్వం నిలిపివేసి ప్రాజెక్టును అటకెక్కించిందని మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా పనులను పరుగులు పెట్టించేలా సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించారని తెలిపారు. రెండో దశలో నిధుల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని 'ఈటీవీ - ఈటీవీ భారత్'కు వివరించారు. 2026 నాటికి పునరావాసం కూడా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
CM Chandrababu Visits Polavaram : సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ముందుగా విహంగ వీక్షణం ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టుని పరిశీలించారు. పోలవరం గ్యాప్ -1, గ్యాప్-2, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రాజెక్టుని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు