Govt Employees Works in YSRCP Leaders House? : ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం (DWMA, డ్వామా)లో ఆప్కాస్ కింద 200 మంది, ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్‌టీఈ) కింద మరో 400 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆప్కాస్ ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. డ్వామా పీడీ నుంచి అదనపు పీడీ, వాటర్‌షెడ్ ఏపీడీ, జిల్లా విజిలెన్స్ అధికారి, క్లస్టర్ ఏపీడీల వరకు అందరూ జిల్లా పర్యటన నిమిత్తం కార్లను ఒప్పంద ప్రకారం నెల వారీ అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు.
డ్వామా కార్యాలయంలో మొదటి నుంచీ ప్రభుత్వ పరంగా కార్లే లేవు. అయినా ఇక్కడ 2 డ్రైవర్ పోస్టులను భర్తీ చేశారు. సదరు డ్రైవర్లను పొరుగు సేవల కింద ఎంపిక చేసి కలెక్టరేట్‌కు కేటాయించారు. ఎఫ్‌టీఈ కింద ఎంపిక చేసిన ముగ్గురు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సహాయకులుగా కొనసాగుతున్నారు. సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మరో ఇద్దరు పని చేస్తున్నారు. డ్వామా పీడీ ఇంట్లోనూ ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా డ్వామా నుంచి జీతం పొందుతున్నా, అధికారుల ఇళ్లకు మార్కెట్ నుంచి కూరగాయలు, పాలు తేవడం, వంట తయారీ, ఇతరత్రా పనులే చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కింద యర్రగొండపాలెం, దోర్నాల, పుల్లలచెరువు, మండలాల్లోని ఆయా కార్యాలయాల్లోనూ మరో ఇవరై మంది ఇదే తీరున విధులు నిర్వహిస్తున్నారు.
అమ్మకానికి పారిశుద్ధ్య ఉద్యోగాలు- తీరు మార్చుకోని పాలకవర్గం - Sanitation Jobs For Sale