ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో 15 మంది ఐపీఎస్​లు బదిలీ - రాచకొండ సీపీగా సుధీర్​ బాబు - ips officers transfer in telangana - IPS OFFICERS TRANSFER IN TELANGANA

Telangana IPS Officers Transfers : 15 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్​ భగవత్​, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్​ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్​ ఏడీజీగా స్టీఫెన్​ రవీంద్ర బదిలీ అయ్యారు.

IPS_Transfers_in_Telangana
IPS_Transfers_in_Telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:35 PM IST

IPS Transfers in Telangana :తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్​ల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్​ భగవత్​, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్​ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్​ ఏడీజీగా స్టీఫెన్​ రవీంద్ర బదిలీ అయ్యారు.

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌లు బదిలీలు :

  • శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్
  • హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా
  • గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర
  • పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్
  • పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
  • టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్
  • రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు
  • ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి
  • మల్టీజోన్ 1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి
  • రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేష్ నాయుడు
  • మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
  • వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్
  • హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా బి.బాలస్వామి
  • హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్
  • సీఏఆర్‌హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి

ABOUT THE AUTHOR

...view details