ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రింగ్​రోడ్​ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - చంద్రబాబు బెయిల్​ రద్దుకు సుప్రీం 'నో' - చంద్రబాబు బెయిల్​ రద్దు

Inner Ring Road Case: చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో సహ నిందితులు బెయిల్​పై ఉన్నప్పుడు చంద్రబాబు బెయిల్​పై ఉంటే నష్టమేంటని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది.

Inner_Ring_Road_Case
Inner_Ring_Road_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 1:01 PM IST

Updated : Jan 29, 2024, 1:26 PM IST

Inner Ring Road Case:తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

2022లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై ఎస్​ఎల్​పీ దాఖలైందని, ఈ కేసులో కూడా 17 A నిబంధన వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయంతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా అని అడిగింది. ఒకవేళ 17 A వర్తిస్తే తదుపరి ఏం చేస్తారని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది.

కాతేరు కదిలింది! - 'రా కదలి రా' కార్యక్రమానికి భారీ జనప్రవాహం

పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఇందులో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు వివరించారు. అయితే ఈ కేసులో సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదిని నిలదీసింది.

చంద్రబాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న కేసుల వివరాలను ధర్మాసనం తీసుకుంది. ఈ సందర్భంగా పలు ధర్మాసనాల ముందు ఉన్న కేసుల వివరాలు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అందించారు. అన్ని వివరాలను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం
మిగతా కేసుల్లో సాధారణ బెయిల్‌ కూడా మంజూరైంది కదా అని అడిగింది.

రింగ్​రోడ్​ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - చంద్రబాబు బెయిల్​ రద్దుకు సుప్రీం 'నో'

కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, కొన్నింటిలో ముందస్తు బెయిల్‌ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సహ నిందితులు బెయిల్‌పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల తరవాత ప్రభుత్వం మారితే తీవ్ర పరిణమాలు ఉంటాయని చంద్రబాబు కుమారుడు ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

చంద్రబాబు కుమారుడు ప్రకటనలు చేసినట్లు ఏమైనా ఉంటే కోర్టులు చూసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించడం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. 2022లో ఇదే వ్యవహారంపై ఎస్​. ఎల్​. పి లో ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. ఒకవేళ నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే సంబంధిత కోర్టులను ఆశ్రయించి బెయిల్‌ రద్దు కోరవచ్చని ధర్మాసనం సూచించింది.

జగన్‌ పతనం ప్రారంభం- భస్మాసుర వధ బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులది : చంద్రబాబు

Last Updated : Jan 29, 2024, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details