Indian Embassy Saved Telugu Worker Siva in Kuwait :కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సాయం అందించారు. కువైట్‌లో తానుపడుతున్న కష్టాలను తెలుపుతూ శివ ఎక్స్‌లో పెట్టారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి లోకేశ్ శివకు సాయం చేయాల్సిందిగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ బృందానికి బాధ్యత అప్పగించారు. వారు ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను ఏపీకి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తక్షణం స్పందించిన మంత్రి లోకేశ్‌కు శివ కృతజ్ఞతలు తెలిపారు.
కూలి చేస్తే గానీ పూట గడవని కుటుంబం :చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన శివ 18 ఏళ్ల కిందట చింతపర్తికి వచ్చి శంకరమ్మను పెళ్లి చేసుకుని, ఇక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శివ భార్య శంకరమ్మ, పెద్ద కుమార్తె ప్రతి రోజు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళుతున్నారు. కూలి చేస్తే గానీ పూట గడవని కుటుంబం వీరిది.
'మా నాన్న కువైట్‌లో కష్టాలు పడుతున్నాడు' - కన్నీటి పర్యంతమైన 11 ఏళ్ల చిన్నారి - Kuwait victim daughter appeal
ఎడారిలో ఒంటరి : ఇలాంటి కుటుంబ నేపథ్యంలో కుమార్తెలను చదివించడానికి, పెళ్లి చేసేందుకు రాయచోటికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఇటీవల శివ కువైట్‌కి వెళ్లారు. అయితే అక్కడ అతను చెప్పిన పని కాకుండా మరొక కష్టమైన పని చేపిస్తూ ఎడారిలో ఇబ్బందులు పడుతుండడంతో, సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అక్కడి ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో ఆయన్ను పెట్టారు.
కువైట్‌లో తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించిన లోకేశ్- బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ - LOKESH ON KUWAIT WORKER
ఆత్మహత్యే శరణ్యం :ఎడారిలో గొర్రెలు మేకలు, కుక్కలు, కోళ్లు, బాతులు, పావురాలకు కాపలాగా పెట్టినట్లు అందులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎవరూ లేరన్నారు. మొత్తం పని అంతా తానొక్కడితోనే చేపిస్తున్నారని, నిద్రాహారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎడారిలో విష సర్పాలు అధికంగా ఉన్నాయని, చనిపోయినా ఎవరు పట్టించుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. దయచేసి ఎవరైనా సాయం చేసి ఈ ఎడారి నుంచి తనను స్వదేశానికి తీసుకెళ్లాలని వీడియోలో పేర్కొన్నాడు. లేకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అన్నాడు. తన బిడ్డలు గుర్తొస్తున్నారని, దయచేసి ఎవరైనా సహాయం చేయాలని వేడుకున్నాడు.
Imran stuck in Dubai: చిత్రహింసలు పెడుతున్నారు రక్షించండి.. దుబాయ్‌లో ఆదోని యువకుడి ఆవేదన