ILLEGAL TRANSPORTATION OF LIQUOR: మద్యం అక్రమ రవాణా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్రమార్కులు నిత్యం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. గతంలో బైక్ల ద్వారా మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా రవాణా చేసేవారు. ఆ తర్వాత కార్లు, బస్సుల్లో సైతం వేర్వేరు చోట్ల పెట్టి, మూటల్లో కట్టి తరలించేవారు. అయితే తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు నిందితులు పట్టుబడేవారు. దీంతో తాము పట్టుబడకుండా ఉండేందుకు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు తాజాగా మనుషుల్లేకుండానే మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అది కూడా ట్రైన్లో చేస్తుండడం గమనార్హం.
ఎలా రవాణా చేస్తారంటే:మద్యం అక్రమ రవాణా చేసే గ్రూపులోని సభ్యుడు మద్యం సీసాలు అట్టపెట్టెల్లో పెట్టుకుని ట్రైన్లో ఏదో ఒక బోగీలోని ఓ బెర్తు కింద వాటిని పెడతాడు. అనంతరం అదే స్టేషన్లో ఆ వ్యక్తి దిగిపోతాడు. అయితే ఈ విషయాన్ని సదరు బెర్తులో ప్రయాణించేవారు రైలులో వెళ్లేవారు ఎవరో పెట్టుకున్నారని మిన్నకుండిపోతారు. దీంతో సరకు ఎక్కడకు పంపాలనుకున్నారో ఆ స్టేషన్ వచ్చేసరికి అదే ముఠాకు చెందిన మరో వ్యక్తి రైలులో ఆ బోగీ వద్దకు వచ్చి మద్యం సీసాలతో ఉన్న అట్టపెట్టెను తీసుకెళ్లిపోతాడు. ఈ విధంగా మనుషుల్లేకుండానే మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతున్న తంతు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎంపీగా గెలిచినందుకు మందు పార్టీ- ఫ్రీ బాటిల్స్ కోసం జనం క్యూ - BJP MP Alcohol Party