IIS officer Vijayakumar Reddy Try to Join Central Information Department : అధికారి తుమ్మా విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్ 9తో ముగిసింది. దీంతో కేంద్ర సమాచారశాఖలో చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ విజయకుమార్‌రెడ్డిని కేంద్ర సమాచారశాఖ తీసుకునేందుకు నిరాకరించడంతో చేసేదిలేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆయన నిర్ణయాలపై విచారణ : విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్ 9తో ముగియడంతో ఆటో రిలీవ్ నిబంధనతో రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇక్కడే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ఉత్తర్వుల దృష్ట్యా సర్వీసులోకి తీసుకునేందుకు కేంద్రం నిరాకరించింది. చేసేది లేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. సమాచారశాఖ కమిషనర్‌గా తీసుకున్న నిర్ణయాలపై, ప్రకటనలు, పుస్తకాలు, కరపత్రాల ముద్రణపై ప్రభుత్వం విచారణ చేయనుంది. అక్రమాల్లో విజయకుమార్‌రెడ్డి, ఇతరుల ప్రమేయంపై ప్రభుత్వం అరా తీస్తోంది.