ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి రంగంలోకి హైడ్రా - అమీన్​పూర్​లో అక్రమ నిర్మాణం కూల్చివేత - HYDRA DEMOLITION IN AMEENPUR

మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా - అమీన్​పూర్​లో అక్రణ నిర్మాణం నేలమట్టం - వరుస ఫిర్యాదులు రావడంతో యాక్షన్​లోకి

Hydra Demolition in  Ameenpur
Hydra Demolition in Ameenpur (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 1:46 PM IST

Hydra Demolishes Illegal Construction in Ameenpur :హైడ్రా మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వేనెంబర్ 848లో అక్రమంగా ఇల్లు నిర్మించారని ఫిర్యాదు రావడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున జేసీబీ సహాయంతో సిబ్బంది భవనాన్ని కూల్చివేశారు.

అమీన్‌పూర్‌ పరిధిలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇల్లు కూల్చివేత (ETV Bharat)

మరోవైపు అమీన్​పూర్​లో ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల్లో ఆక్రమణలు జరగడంతో హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ అక్రమ నిర్మాణాన్ని పడగొట్టామని హైడ్రా సిబ్బంది చెప్పింది. ఎటువంటి ఘటనలకు తావులేకుండా పోలీసులు ముందస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం - కావూరి హిల్స్​లో షెడ్లు కూల్చివేత - Demolishing Illegal Constructions

ABOUT THE AUTHOR

...view details