2 Members Arrested For Trying To Rape A Young Woman : ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి, అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మియాపూర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఉందంటూ నమ్మించిన వారు, జూన్ 30న మియాపూర్ రావాలని సూచించారు.
30వ తేదీన యువతి సంస్థ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న ఇద్దరు సేల్స్‌మెన్‌లు సంగారెడ్డి, జనార్ధన్ రెడ్డి యువతిని యాదగిరిగుట్టలోని ఓ స్ధిరాస్తికి సంబంధించిన సమావేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మీటింగ్ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి కారులో వస్తుండగా, వారిద్దరు కారును ఓ నిర్మానుష్య ప్రాంతంలో నిలిపివేశారు. కారు మరమ్మతు కారణంగా నిలిపివేశామని ఆమెకు చెప్పారు. అనంతరం ఆమెకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. మత్తులో ఆమె అచేతనంగా పడి ఉండటంతో, ఇదే అదనుగా యువతిని వివస్త్రను చేసి, అత్యాచారయత్నం చేశారు. అనంతరం యువతిని తిరిగి మియాపూర్ వద్ద వదిలిపెట్టి వారు వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం
జులై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో 2న ఉప్పల్ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తర్వాత జీరో ఎఫ్ఐఆర్ను మియాపూర్ ఠాణాకు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జనార్దన్ రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.