Hyderabad Police Arrested Gujarat Cyber Criminals :హైదరాబాద్ పరిధిలో నిత్యం సైబర్ నేరాలు, సైబర్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. జాబ్‌ల పేరిటఅమాయక ప్రజలను బురిడీ కొట్టించి, పెద్ద మొత్తంలో సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా అటువంటి కేసునే సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. డేటా ఎంట్రీ జాబ్(Data Entry Job) పేరిట వల వేసి, తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని, బాధితులను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు
సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఫ్లోరా సొల్యూషన్స్ పేరిట డేటా ఎంట్రీ జాబ్ ఉందని పార్ట్‌టైం ఉద్యోగం(Part Time Job) కోసం చూస్తున్న వారికి వల వేస్తున్నారు. తర్వాత బాధితులకు లాగిన్ ఐడీ పంపంచి, పని చేయమని సూచిస్తున్నారు. నమ్మిన బాధితులు పని పూర్తిచేయగానే కంపెనీ నిబంధనల పరిధిలో పని చేయడం లేదని, నిబంధనలు ఉల్లఘించారని ఫేక్ లీగల్ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు.
అలా ఫేక్ నోటీసులకు భయపడి ఓ ఫిర్యాదుదారు రూ.6,17,600 చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఆ నలుగురు నిందుతులు రాహుల్ అశోక్ భాయ్ భవిస్కర్, సాగర్ పాటిల్, కల్పేశ్ త్రాట్, నీలేశ్ పాటిల్‌లను సూరత్‌లోనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1గా ఉన్న వ్యక్తి గతంలో టెలీకాలర్‌గా(Tele caller) పనిచేశాడని తన మిత్రులతో కలిసి ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు.