Rs 7 Crore Drugs Seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 7.096 కిలోల హైడ్రోఫోలిక్ వీడ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాదక ద్రవ్యాల విలువ 18 లక్షల రూపాయల :హైదరాబాద్ చందానగర్‌లో 155 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. గుల్‌మోహర్ పార్క్ కాలనీలో వ్యాపారి ఇంటికి రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నిందితుడు కృష్ణరామ్ విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. నిందితుడితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన ఎన్‌సీబీ అధికారులు, మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ 18 లక్షల రూపాయల విలువ ఉంటుదని అధికారులు తెలిపారు.