Huge Donations To Eenadu Relief Fund :తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ 5 కోట్ల రూపాయలతో 'ఈనాడు రిలీఫ్ ఫండ్' ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు ఆహ్వానించింది. ఈనాడు పిలుపుతో వదాన్యులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. దిల్లీకి చెందిన న్యూస్‌ప్రింట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కార్పొరేషన్-ఎన్టీఎస్సీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్ సంస్థల ఛైర్మన్ ప్రేమ్‌కిషన్ గుప్త, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇషాన్ గుప్త, సంవిద్‌గుప్త కోటి రూపాయల విరాళం ఇచ్చారు. సంబంధిత చెక్కును ఈనాడు సంస్థ జనరల్ మేనేజర్ బండి గణపతికి అందజేశారు. రామోజీ గ్రూపుతో తమకు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్న ప్రేమ్‌కిషన్ గుప్త వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేశామన్నారు. తాము ఇచ్చిన ప్రతి పైసా బాధితులకు అందుతుందనే నమ్మకంతోనే ఈనాడు సహాయ నిధికి విరాళాన్ని అందించినట్లు చెప్పారు.
Flood Victims in Telugu States :తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, పాఠకులు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఈనాడు ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పోపూరి పూర్ణచంద్రరావు, శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ జి.చంద్రశేఖర్ లక్షా 116 రూపాయల చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ పి.రఘురామ్ లక్ష, ఎన్.సి. ఇందిర లక్ష, సహస్రావధాని గరికపాటి నరసింహారావు లక్ష ఇచ్చారు. చిక్కం చంద్రశేఖర్‌రావు, ఉరవకొండకు చెందిన మోకా నాగరాజు, తెనాలికి చెందిన గడ్డిపాటి ఉషాబాల, గడ్డిపాటి నాగయ్య చౌదరి, తెన్నేరుకు చెందిన దేవినేని చంద్రశేఖర్‌రావు 50 వేల రూపాయల చొప్పున విరాళం అందించారు.
ఆదోనికి చెందిన డా.ఆర్.ఎస్.రఘూజి 25వేలు, హైదరాబాద్‌కు చెందిన గన్నే సునీత 25వేలు, ఆళ్లగడ్డకు చెందిన సి.శ్రీనాథరెడ్డి 25 వేలు, నల్లజర్లకు చెందిన పి. కాశీ విశ్వనాథ్ పాతిక వేలు ఇచ్చారు. జంగారెడ్డిగూడేనికి చెందిన కిడ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ 20 వేల 400 రూపాయలు, కర్ణాటకకు చెందిన కాంతామణి శ్రీనివాస 11 వేల ఒక రూపాయి, హైదరాబాద్‌కు చెందిన కరమల సుబ్రమణియచారి, కె.వి. కవిత, మాధవపెద్ది సురేశ్ చంద్ర 10 వేల 116 రూపాయల చొప్పున అందించారు.
హైదరాబాద్‌కు చెందిన దివి పాండురంగారావు 10వేలు ఇచ్చారు. మన్నవ చిన్న వెంకయ్య 5 వేల 678, కరంశెట్టి వెంకట వరప్రసాదరావు, కరంశెట్టి వెంకట నాగ అర్చన, కె.ఎస్.ఎన్. రాజు, టి. శ్రీకాంత్‌రెడ్డి , బుట్టాయగూడెంకు చెందిన నల్లూరి కృష్ణమోహన్ ఒక్కొక్కరు 5 వేల 678 విరాళం ఇచ్చారు. విశాఖకు చెందిన పి.వీర్రాజు 5వేల ఒక్క రూపాయి. హైదరాబాద్‌కు చెందిన కేశవరావు 5వేల ఒక్క రూపాయి అందించారు. విశాఖకు చెందిన సి. సూర్యప్రకాశరావు , హిందూపురానికి చెందిన పి.ఎ. నాగరాజ, తాండూరుకు చెందిన గొంధి ఝాన్సీ లక్ష్మీబాయి 5వేల రూపాయల చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేశారు.