తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగుల సదరం సర్టిఫికెట్​ పోయిందా? - క్షణాల్లో డౌన్​లోడ్​ చేసుకోండిలా! - HOW TO DOWNLOAD SADAREM CERTIFICATE

- ఇప్పుడు ఆన్​లైన్​ ద్వారానే వెంటనే కొత్త కాపీ.. - ఈ ప్రాసెస్ ఫాలో అయితే క్షణాల్లో చేతుల్లోకి

How to Download SADAREM Certificate by Online
How to Download SADAREM Certificate by Online (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

How to Download SADAREM Certificate by Online: శారీరక వైకల్యం, మానసిక లోపాలు, దృష్టి లోపం.. ఇలా శారీరక లోపాలతో బాధపడే వారి వైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అందించేదే సదరం సర్టిఫికెట్​. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం ఈ ధ్రువపత్రాలను అధికారులు అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి.. ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.

అయితే.. పలు కారణాల వల్ల ఈ సర్టిఫికెట్లు పోవడమో లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడమో లేదా ధ్వంసం కావడమో జరగొచ్చు. దీంతో ఈ సర్టిఫికెట్ వల్ల పొందాల్సిన ప్రయోజనాలను పొందలేరు. కోల్పోయిన సర్టిఫికెట్​ను ఎలా పొందాలో తెలియక గతంలో లబ్ధిదారులు ఆందోళన చెందేవారు. అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం నిమిషాల్లోనే ఆన్​ లైన్ ద్వారా సదరం సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

సదరం ఐడీ ఎలా చెక్​ చేసుకోవాలి:సదరం సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే సదరం ఐడీ తెలిసి ఉంటాలి. ఒకవేళ ఆ ఐడీ గుర్తు లేకపోతే ముందుగా ఆ ఐడీ వివరాలు తెలుసుకోవాలి. అందుకోసం..

  • ముందుగా తెలంగాణ సదరం పోర్టల్​ విజిట్​ చేయాలి. https://sadarem.telangana.gov.in/sadaremdefault.do#
  • హోమ్​ పేజీలో టాప్​ బార్​లో కనిపించే Quick Search ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. మీకు కొత్త పాప్​అప్​ పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అందులో జిల్లా, మండలం, గ్రామం, మీ పేరు(సదరం సర్టిఫికెట్లో ఉన్న విధంగా) ఎంటర్​ చేసి Search ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • సదరం లిస్ట్​లో మీరు ఎంటర్​ చేసిన పేరు కలిగిన వారి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు చూసుకుని సదరం ఐడీని సేవ్​ చేసుకోవాలి.

సదరం సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవడం:

  • ఫోన్​ లేదా డెస్క్​టాప్​లో బ్రౌజర్​ ఓపెన్​ చేయాలి.
  • ఆ తర్వాత Telangana SADAREM Certificate Print అని సెర్చ్​ చేసి ఓపెన్​ చేయాలి.
  • మీరు అంతకుముందు సేవ్​ చేసుకున్న సదరం ఐడీని ఎంటర్​ చేసి Submit ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • మీరు సబ్మిట్​ చేసిన తర్వాత మీకు స్క్రీన్​ మీద రెండు ఆప్షన్​లు కనిపిస్తాయి. అవి.. సదరం సర్టిఫికెట్​ డౌన్​లోడ్(Click here to Download Certificate)​ లేదా సదరం ఐడీ(Click here to Download ID Card) కార్డ్​ డౌన్​లోడ్.
  • అందులో మీకు కావాల్సిన ఆప్షన్​పై క్లిక్​ చేస్తే మీ సర్టిఫికెట్​ ఓపెన్​ అవుతుంది. దానిని డౌన్​లోడ్​ చేసుకుని సేవ్​ చేసుకుంటే భవిష్యత్​ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

మీ టెన్త్​ సర్టిఫికెట్​లో స్పెల్లింగ్​ తప్పు పడిందా? - ఏం చేయాలో తెలుసా?

ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - కచ్చితంగా అవసరం - ఇలా అప్లై చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details