How to Check Voter ID by Mobile Number:దేశంలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటర్ గుర్తింపు కార్డ్ అందిస్తారని మనందరికీ తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి పౌరుడికి ఓటర్ గుర్తింపు కార్డ్ అందించి.. ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, ఓటర్ కార్డ్ కేవలం ఎలక్షన్లలో ఓటు వేయడానికే కాకుండా.. బ్యాంక్ ఖాతా తెరవడానికి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఇలా పలు విధాలుగా ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే, త్వరలో రాష్ట్రంలోగ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో పేరు ఉందో? లేదో ప్రతి ఒక్కరూ తప్పకుండా చెక్ చేసుకోవాలి. అందుకోసం రెండు విధాలు ఉన్నాయి. అందులో ఒకటి మొబైల్ నెంబర్, రెండోది EPIC నెంబర్ ఆధారంగా పేరు చెక్ చేసుకోవచ్చు. మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
మొబైల్ నెంబర్ ద్వారా..
- ముందుగా https://electoralsearch.eci.gov.in/లింక్‌ని క్లిక్ చేయండి.
- ఆపై 'సెర్చ్ బై మొబైల్ నెంబర్(Search by Mobile Number)' ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇప్పుడు రాష్ట్రం, లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- ఆపై క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి.. సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ వివరాలు, పోలింగ్ స్టేషన్ వంటివి కనిపిస్తాయి. అవసరమనుకుంటే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.