High Temperature in AP:వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. నేడు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారుగా 44 °C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా 268 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం 12 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 11, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ 2, పల్నాడు 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎమ్‌డీ సూచించింది.
శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 6, కాకినాడ 12, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 19, కృష్ణా 13, ఎన్టీఆర్ 14, గుంటూరు 17, పల్నాడు 16, బాపట్ల 12, ప్రకాశం 24, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 11, నంద్యాల 1, వైఎస్సార్ 1, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు మెుత్తంగా 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.