ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొందరపాటు చర్యలు తీసుకోవద్దు - స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకి ఊరట - Skill Case Atchannaidu Bail - SKILL CASE ATCHANNAIDU BAIL

High Court on Atchannaidu Bail Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

High_Court_on_Atchannaidu_Bail_Petition
High_Court_on_Atchannaidu_Bail_Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 3:48 PM IST

High Court on Atchannaidu Bail Petition: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడుపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుని సీఐడీ అధికారులు నిందితునిగా చేర్చారు. దీంతో స్కిల్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్న వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు.

ABOUT THE AUTHOR

...view details