ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వానలు - నలుగురు మృతి - Guntur Heavy Rains - GUNTUR HEAVY RAINS

Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందగా మంగళగిరిలోని గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందింది.

Heavy Rains in AP
Heavy Rains in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 2:46 PM IST

Updated : Aug 31, 2024, 8:04 PM IST

Heavy Rains in Joint Guntur District :ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయ రహదారి, 3 వంతెనల మార్గం, చుట్టుగుంట మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, శివారెడ్డిపాలెం పరిసరాల్లో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాల కారణంగా నలుగురు మృతి: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మంగళగిరిలోని గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందింది. ఆమె ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పడిన రాయి పడటంతో నాగరత్నమ్మ అక్కడికక్కడే చనిపోయింది.

Guntur Rains Today 2024 : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మోకాళ్ల లోతులో నీరు ప్రవహిస్తోంది. వర్షపు నీటిలో కార్లు, బైకులు ఆగిపోవటంతో రామవరప్పాడు రింగు రోడ్డు నుంచి నిడమానూరు వరకూ ట్రాఫిక్ జామ్ అయింది. శివారు కాలనీలను వరద ముంచెత్తిది. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మున్సిపల్ సిబ్బంది వరద నీటి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

AP Rains Updates 2024 :మరోవైపు అమరావతిలోని పొట్టేళ్ల వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు రాజధాని ప్రాంతంలోనూ, మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. రత్నాల చెరువులోని వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ సుభాని మంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తాడేపల్లి ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లు నీట మునిగాయి.

బాపట్ల జిల్లాలో దంచికొడుతున్న వర్షం :బాపట్ల జిల్లాలో వర్షం దంచికొడుతోంది. చీరాల, బాపట్ల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, కారంచేడు, అద్దంకి, నగరం, రేపల్లె ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో రహదారులు జలమయమయ్యాయి. దళితవాడలోని రైతు సేవా కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.

వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు : పల్నాడు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రయాణికులు, విద్యార్థులతో మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు లాగారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వాన దంచికొడుతోంది. పరస, కంభంపాడు, తాళ్లూరు,పెదకూరపాడు, చిన్నమక్కెన గ్రామాల మధ్య ఉన్న లోతట్టు వంతెనలపై నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సత్తనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో దిగుబడులపై ప్రభావం పడుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాకపోకలకు తీవ్ర అంతరాయం: మంగళగిరి టోల్‌ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పీఎస్‌ సమీపమంతా జలమయమైంది. టోల్‌గేట్‌ వద్ద ప్రధాన రహదారిపైకి భారీగా నీటి చేరికతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. వరద నీటితో మంగళగిరి టోల్‌ప్లాజా ప్రాంతం జలాశయాన్ని తలపిస్తోంది. దీంతో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల విజ్ఞప్తి చేశారు.

కాజా వద్ద కొత్త చెరువుకు గండి పడటంతో టోల్ గేట్​ వద్దకు భారీగా నీరు చేరుకుంది. మోకాల్లోతు నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మంగళగిరి గ్రామీణ పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద పహారా కాస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష - వానలపై ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్‌లు పంపాలి - Heavy Rains in AP

విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి - మరో ఐదుగురికి తీవ్రగాయాలు - Landslide in Vijayawada

Last Updated : Aug 31, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details