Hyderabad Rains Today :ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన దచికొట్టింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన (ETV Bharat) ఆ ప్రాంతాల్లో భారీ వర్షం : ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, ముషీరాబాద్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముసారాంబాగ్ వంతెనను వరద తాకుకుంటూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయింది. బేగంబజార్, అబిడ్స్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నూమ, చార్మినార్, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షం దంచి కొట్టింది. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
స్కూల్‌కు వెళ్లాలంటే పడవ ఎక్కాల్సిందే - ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం
సీపీ ఆనంద్ అత్యవసర సమావేశం : వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. నగరంలో అధికార యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాలని అధికారులకు సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
ఐటీ కంపెనీలతో అనుసంధానం : ప్రజలకు ఎప్పటికప్పుడు ఐఎండీ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్డేట్స్ను అందించాలని సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మేనేజ్మెంట్పై దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వర్షాలు కురుస్తున్న వేళ ఐటీ కంపెనీలతో అనుసంధానం చేయడం, ప్రధాన నీటి వనరులలో నీటి మట్టాలను పర్యవేక్షించడం, సాంకేతికతను పెంచడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం - రహదారులు జలమయం - Heavy Rain in Hyderabad
దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods