ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం - ఇళ్లలోకి చేరిన నీరు - HEAVY RAIN IN GUNTUR DISTRICT

గంటన్నరపాటు భారీ వర్షం - లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

heavy_rain_in_guntur_district_road_blocked_with_flood_water
heavy_rain_in_guntur_district_road_blocked_with_flood_water (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 7:33 PM IST

Heavy Rain In Guntur District Road Blocked With Flood Water : గుంటూరు నగరంలో గంటన్నరపాటు ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. రహదారిపై రెండు అడుగుల మేర నీరు నిలవటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వర్షం వెలిసిన తర్వాత రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో రాకపోకలు సాగించటం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అరండల్‌పేట ప్రధాన రహదారి నుంచి ఉమెన్స్‌ కళాశాల రహదారి వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన నగరపాలక సిబ్బంది వర్షపు నీరు డ్రైనేజీలో వెళ్లేలా చర్యలు చేపట్టారు.

అయితే ఇటీవలే నగరపాలక సంస్థ డ్రైనేజీ కాలువ మీద ఉన్న అక్రమాలను తొలగించి, పూడిక తీయడంతో వరద నీటి నుంచి నగరవాసులకు వెంటనే ఉపశమనం కలిగింది. పారిశుద్యం , టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది సైతం అప్రమత్తమై ఎక్కడికక్కడ నీరు తొలగించే చర్యలు తీసుకోవడంతో రహదారుల మీద మూడు అడుగుల మేర చేరిన వాన నీరు రెండు, మూడు గంటల వ్యవధిలోనే డ్రైనేజీ కాలువల ద్వారా వెళ్లిపోవడంతో గుంటూరు వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

కంకరగుంట వంతెన కింద నీరు రావడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారు. కుండపోత వర్షానికి తోపుడు బండ్ల వ్యాపారస్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. కలెక్టరేట్‌, మహిళా కళాశాల రోడ్డు, నగరపాలక సంస్థ కార్యాలయం, అమరావతి రోడ్డు, మంగళగిరికి వెళ్లే రహదారుల్లో, బ్రాడీపేట వంతెన కింద పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. శంకర విలాస్ సెంటర్ నుంచి మహిళా కళాశాల వరకు వాహనాలు నిలిచిపోయాయి. అరండల్‌పేట వంతెనపై పెద్ద ఎత్తున గుంతలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జెడ్పీ కార్యాలయం మార్గంలోనూ భారీగా వరద నీరు చేరడంతో. వరదలోనే ప్రజలు రాకపోకలు సాగించారు. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి వరద నీరు పీకల వాగులోకి చేరడంతో ఉద్ధృతంగా ప్రవహించింది.

Rains In Prakasam District :ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. ఒంగోలులో కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగమూరు రోడ్డు, సుజాత నగర్, సాయిబాబా గుడి, సరస్వతీ కాలేజీ రోడ్డు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీరు, మురుగుతో ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్న చినుకు పడినా చిత్తడిచిత్తడి అవుతోందని వ్యాపారం సాగట్లేదని దుకాణదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

దంచికొడుతున్న వానలు- జలదిగ్భంధంలో రహదారులు

ABOUT THE AUTHOR

...view details