HC Issued Orders To Government : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బహదూర్‌పల్లిలోని 38 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టుఆదేశాలు జారీ చేసింది. 38 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతోపాటు ఈ భూమిని ప్రైవేటు కంపెనీలు దక్కించుకొని నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు భూములు కొనుగోలు చేసిన పలు స్థిరాస్తి సంస్థలకు నోటీసు జారీ చేసింది.
Ashok kumar filed Public Interest litigation :సరూర్ నగర్‌లో 2100 ఎకరాలు, బహదూర్‌పల్లిలో 2100 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2021 మార్చి 13న కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఎల్బీనగర్‌కు చెందిన సీహెచ్ అశోక్ కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest litigation) దాఖలు చేశారు. పరిశోధనల నిమిత్తం సౌత్ ఇండియా రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు 1985లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కేవలం ప్రజాప్రయోజనాల నిమిత్తమే వినియోగించాల్ని ఉందని ఒప్పందం కుదిరిందని పిటీషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.
అప్పట్లో ఎకరం రూ. 3 ల చొప్పున అప్పగించిందని ప్రస్తుతం ఈ భూమి విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉందన్నారు. పరిశోధన సంస్థ(Research Institute) చుట్టూ నివాస గృహాలు పెరగడంతో కాలుష్య మండలి ఆదేశాలతో కార్యకలాపాలను నిలివేసిందని సంస్థ ఈ భూమిని(land) ఆన్యాక్రాంతం చేస్తూ రావడంతో నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఉపయోగించాల్సిన భూమిని విక్రయించినట్లు పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంతోపాటు ప్రతివాదులైన ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.