AP NEW DGP : ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
Next DGP in AP : ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయణ్ని ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీశ్‌కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీవిరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీశ్‌కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.