ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules - GUNTUR POLICE VIOLATED RULES

Guntur Police Harassing A Young Man : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల యావలో కుటుంబ, ఆర్థిక వివాదాల్లో తలదూర్చుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆ శాఖ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు. తాజాగా ఓ కేసులో గుంటూరు పోలీసులు గీత దాటి ప్రవర్తించడం కలకలం రేపింది.

Guntur Police Violated Rules
Guntur Police Violated Rules (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 10:46 AM IST

Guntur Police Violated Rules : ఏపీలో కొందరు ఖాకీలు పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోతున్నారు. సివిల్‌ తగాదాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఆ శాఖలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు మితిమీరి జోక్యం చేసుకున్నారు.

'మీపై కేసు ఉంది పదండి స్టేషన్‌కని చెప్పి' బాధిత యువకుడిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకుని సుమారు గంటకుపైగా తిప్పి పలు రకాలుగా వేధించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన గుంటూరులో ఈ నెల 11న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఒంగోలుకు చెందిన ఇర్ఫాన్‌ అనే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ నల్లపాడు స్టేషన్‌ పరిధిలోని ఓ యువతిని ప్రేమించాడు. పెద్దల సమక్షంలో గత మే నెలలో వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఇంటికొస్తే వివాదాన్ని పరిష్కరించుకుందామని ఇర్ఫాన్​ను ఆ యువతి పిలవగా అతను ఈ నెల 11న వెళ్లాడు. అప్పటికే ఆ ఇంట్లో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు ఉన్నారు. ఆ యువకుడు రాగానే ఆ అమ్మాయి విడాకులిస్తానని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

AP Police Involved Illegal Activities : అనంతరం ఇద్దరు పోలీసు సిబ్బంది ఇర్ఫాన్​ని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకున్నారు. పోలీసు కుటుంబానికి చెందిన అమ్మాయినే ఇబ్బంది పెడతావా? అంటూ అతడిని ప్రశ్నిస్తూ మరోవైపు కొడుతూ గుంటూరు అంతటా తిప్పారు. పోలీస్​స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లడం లేదని బాధితుడు ప్రశ్నించినా వినలేదు. చివరకు బస్టాండ్‌ లోపలికి తీసుకెళ్లి వాహనాన్ని ఆపి వారు ఫోన్లో మాట్లాడుతుండగా ఇర్ఫాన్​ తన బంధువులకు ఫోన్‌ చేసి రప్పించారు. అతనిపై ఏం కేసు పెట్టారు? నోటీసులేవీ అని బంధువులంతా నిలదీయగా పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.

వెంటనే​ బంధువులతో కలిసి అదే రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని ఇర్ఫాన్ తెలిపారు. ఫిర్యాదు ఇచ్చి వచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 13న మరోసారి వెళ్లి ఎస్పీని కలిసి చెప్పామని వివరించారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా స్టేషన్‌ అధికారులు ఆదివారం తనను పిలిచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని వెల్లడించారు. దీని వెనుక ఓ సీఐ ఉన్నారని ఇర్ఫాన్​ వాపోయారు.

ఇర్ఫాన్‌ భార్య ఫిర్యాదు మేరకే : తనను పెళ్లి చేసుకుని మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఇబ్బంది పెడుతున్నారని ఆయన భార్య స్టేషన్లో ఫిర్యాదు చేసిందని మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ పీవీ సుబ్బారావు తెలిపారు. ఈ నెల 11న తన ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నారని చెప్పడంతో ముందు జాగ్రత్తగా పోలీసులను పంపామని అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆ యువకుడిని పిలిచి ఏం జరిగిందో తెలుసుకున్నామని చెప్పారు. నివేదికను ఎస్పీకి అందజేస్తానని వివరించారు. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి ఏ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు? ఆమె ఇంటికెళ్లిన పోలీసులెవరని ప్రశ్నించగా తనకు ఆ వివరాలు తెలియవని డీఎస్పీ పేర్కొనడం గమనార్హం.

ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions

హద్దులు మీరుతున్న పోలీసు అరాచకాలు

ABOUT THE AUTHOR

...view details