తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో జీబీఎస్ వ్యాధి తొలి కేసు నమోదు - అసలేంటీ వ్యాధి, ఎలా వస్తుందంటే? - GBS FIRST CASE REGISTERED IN TG

హైదరాబాద్‌లో గీయే బరే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు - బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందంటున్న వైద్యులు - చికిత్సతో నయం చేయవచ్చన్న డాక్టర్లు

GBS First Case Registered In Hyderabad
GBS First Case Registered In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 10:20 AM IST

Updated : Jan 31, 2025, 6:04 PM IST

GBS First Case Registered In Hyderabad :హైదరాబాద్‌ నగరంలో గీయే బరే (జీబీఎస్‌) తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్‌ ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధరించారు. బాధితురాలు ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 100 వరకు జీబీఎస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గీయే బరే సిండ్రోమ్‌ (జీబీఎస్) కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్‌, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్) పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది.

గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు :ఈ గీయే బరే సిండ్రోమ్ రుగ్మత బారినపడిన వారికి ఈ కింది లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

  • ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం
  • కండరాలు బలహీనంగా మారడం
  • డయేరియా
  • పొత్తి కడుపు నొప్పి
  • జ్వరం
  • వాంతులు

కారణాలు : కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు వెల్లడించారు.

దేశంలో అరుదైన వ్యాధి విజృంభణ- వారంలోనే 100 మందికి వ్యాప్తి! లక్షణాలు, కారణాలు ఏంటి?

ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ - అనుక్షణం భయంభయంగా గడుపుతున్న స్థానికులు

Last Updated : Jan 31, 2025, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details