ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష- ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తి అరెస్ట్ - గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్ష

APPSC Chairman Gautam Sawang: ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది ఈ పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదన్నారు. చిత్తూరు జిల్లాలో ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఉంటాయన్నారు.

APPSC Chairman Gautam Sawang
APPSC Chairman Gautam Sawang

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 3:42 PM IST

APPSC Chairman Gautam Sawang:రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్2పరీక్షకు 4 లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా లో 463517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేశారని, 95.8 శాతం మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేశారన్నారు. గ్రూప్2 పరీక్షలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదుకాలేదన్న ఆయన చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో ఒకరు పరీక్షకు హాజరుకాగా పట్టుకున్నట్లు తెలిపారు.

వదంతులు నమ్మవద్దు:నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారం పై పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలు జరిగే తీరును విజయవాడ ఎపీపీఎస్సీ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ రూంలో గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను జూన్ లేదా జూలైలో లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17 న గ్రూప్1 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహిస్తామని, పరీక్షను వాయిదా వేసేది లేదని, ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలని సవాంగ్ సూచించారు.
గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ.. గ్రూప్-1 వివాదంపై చర్చ !

గుంటూరు జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను గుంటూరు, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, చేబ్రోలు సహా అన్ని ప్రముఖ పట్టణాల్లోని 56 కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షకు 28, 209 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాట్లు చేశారు.
APPSC Group 1 Mains Result 2023: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. త్వరలో గ్రూప్​-1, 2 నోటిఫికేషన్లు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 32వేల 391 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 111పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాయదుర్గంలోని 7 కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నెల్లూరు జిల్లాలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం 80 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23 వేల908 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.


ప్రకాశం జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 49 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్టు చెప్పారు. మొత్తం 21వేల 465 విద్యార్దులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
Group 1 Mains: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్.. ఈసారి ఆఫ్​లైన్​లోనే

ABOUT THE AUTHOR

...view details