Govt Orders Appointing Ramakrishna Reddy as MD of AP Metro Rail:ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్పీ. రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు వివరించింది. మూడేళ్ల పాటు ఆయన ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేషమైన అనుభవం ఉన్న ఆయన్ను మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణా రెడ్డి పని చేశారు. ప్రస్తుత ఎండీ జయ మన్మథరావును రిలీవ్ చేస్తూ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు.
Chandrababu on Visakha Metro Rail Project :విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.
పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO