ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నెలలోపు వివరణ ఇవ్వండి' - సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం - GOVERNMENT ACTION AGAINST SANJAY

అధికార, నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు - అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం

former CID chief Sanjay
former CID chief Sanjay (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 10:24 PM IST

Updated : Jan 21, 2025, 10:54 PM IST

Govt Orders Disciplinary Action on former CID chief Sanjay:ఏపీసీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం, నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ట్యాబ్‌ల కొనుగోళ్లలో ఆరోపణలు ఉన్నాయి.

అగ్ని మొబైల్‌ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని సంజయ్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని సంజయ్‌ని ప్రభుత్వం ఆదేశించింది. సంజయ్‌ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాజకీయ ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిక జారీ చేసింది. వేర్వేరు అభియోగాలపై సంజయ్‌ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఇదీ కేసు: 'అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (NOC)లు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు ఎన్.సంజయ్‌ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చి, 1.19 కోట్ల రూపాయలు చెల్లించారు. సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు.

క్రిత్వ్యాప్‌ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారు. ఈ కేసుల ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థల ఖాతాల్లో జమ అయిన డబ్బు ఎవరు విత్‌డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేసింది. క్రిత్వ్యాప్, సౌత్రికా 2 ఒకే చిరునామాలో ఉన్నాయని, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ డొల్ల కంపెనీ అని విజిలెన్స్‌ తేల్చింది.

జీవితం చాలా విలువైనది - ద్విచక్రవాహనదారులు హెల్మెట్​ ధరించాలి: బాలకృష్ణ

వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట - వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ పునఃపరిశీలన

Last Updated : Jan 21, 2025, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details