Good Friday Celebrations in AP : రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్నా భక్తులు భక్తి శ్రద్ధతో క్రీస్తును ప్రార్థించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కడప జిల్లాలో గుడ్ ఫ్రైడే పండుగను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరియాపురంలోని చర్చిలో ఏసుక్రీస్తు శిలువయాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శిలువను మోస్తే తమ పాపాలు తొలగుతాయని విశ్వాసం. దీంతో శిలువను మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. నగరంలో భారీ సంఖ్యలో మహిళా భక్తులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
'శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలన్న దయామయుడు ఏసుక్రీస్తు'
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులందరూ క్రీస్తు మరణ ఘట్టాలైన 14 స్థలాలను ధ్యానించారు. పట్టణంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో మత పెద్దలతో పాటు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు మరణానికి సంబంధించిన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. అలాగే శిలువలను చేతపట్టుకొని యానం పురవీధుల్లో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతి పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Good Friday Festival 2024 : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఏసూ శిలువని ఊరేగింపు చేశారు. ప్రజల పాపాలను భరించి ఏసుక్రీస్తు శిలువపై ప్రాణాలు వదిలి సమస్త మానవాళిని రక్షించాడని భక్తులకు తెలిపారు.
గుడ్ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువ వేసిన ప్రతిమను వాహనంపై పెట్టి పట్టణ ప్రధాన రహదారుల్లో ఊరేగింపు జరిపారు. క్రీస్తు శిలువ పయనించిన మార్గంలో వెలకట్టలేని దయా మార్గాన్ని క్రీస్తు చూపిస్తాడని భక్తుల విశ్వాసం. శిలువ మార్గంలో క్రైస్తవులు క్రీస్తు వ్యాఖ్యలను వినిపిస్తూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగారు.
నెల్లూరులో గుడ్ ఫ్రైడే వేడుకలం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఏసుక్రీస్తూ సమాధి కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఏసు మార్గం ఆదర్శనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గాలని కృష్ణాజిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ అన్నారు. గుడ్ ఫ్రైడే వేడుకలు పురస్కరించుకొని వేలాదిగా క్రైస్తవులు అవనిగడ్డ పురవీధుల్లో శిలువ మార్గం నిర్వహించగా అందులో వెంకట్రామ్ శిలువ మోశారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు సమస్థ మానవాళి కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషిని ప్రేమించటం బలహీనులకు అండగ నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందామని చంద్రబాబు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఏసు ప్రభువు సమాధికార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే.. ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు
ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు - క్రైస్తవుల ప్రార్థనలతో కిక్కిరిసిన చర్చిలు