ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కొక్కొరొకో!" తగ్గేదేలే అంటున్న పందెం కోళ్ల ధర - ఒక్కో పుంజు ధర తెలిస్తే షాక్! - PANDEM KODI

మొదలైన సంక్రాంతి హడావిడి - వేట ప్రారంభించిన పందెం రాయుళ్లు

Cock Fight in AP
Cock Fight in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2024, 10:35 AM IST

Cock Fight in AP :సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో పందెం కోడి కోసం వేట మొదలైంది. ఈ పందాల్లో కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు సర్వసాధారణం. కోడిపుంజు మెడమీద ఈకలు రెక్కించి ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే దృశ్యం పందెం రాయుళ్లకు కావాల్సినంత మజానిస్తుంది. అందుకే వారు పుంజలను బరిలో దింపేదుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం వేలకు వేలు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన కోళ్లకు శిక్షణ, పోషకాహారం ఇచ్చి బరికి సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోడి పందేల మాట ఘనంగా వినిపిస్తోంది. అదే క్రమంలో ఆసక్తి ఉన్నవాళ్లు గ్రామాల్లో తిరుగుతూ మేలైన పుంజులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని బుచ్చి, సర్వేపల్లి, రాపూరు, కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందేలు నిర్వహించడం పరిపాటి. ఈ నేపథ్యంలోనే కొందరు కొన్ని నెలలకు ముందే గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల నుంచి తక్కువ ధరకు మేలైన పుంజులను కొనుగోలు చేసి పందేలకు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు.

కొక్కిరాయి, డేగ, కాకి డేగ, అబ్రాస్, తెలుపు, నలుపు నెమళ్లు తదితర పేర్లతో పిలిచే కోళ్లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా బరుల నిర్వాహకులు 20 నుంచి 30 వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కోదాన్ని రూ.25వేల నుంచి 50వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ముందస్తుగా డబ్బులు చెల్లించి పందేలకు కోళ్లను సిద్ధం చేయిస్తున్నారు.

బాలింత కంటే భద్రంగా :పందెం కోళ్లకు నిత్యం ఉడికించిన మటన్, ఉడకబెట్టిన గుడ్లు, జీడిపప్పు, రాగులు, సజ్జలు, బాదం తదితర ఆహారం పెడతారు. బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేతను తినిపిస్తారు. అశ్వగంధ పొడిని పొగరు పెరగడానికి పట్టిస్తారు. బికాంప్లెక్స్‌ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి పెడతారు. తాగేందుకు, స్నానానికి వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణ కోసం నీళ్లలో వదిలి వారానికి ఒకసారి ఈత కొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు.

ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు

కత్తులు దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details