ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పుంజు స్పెషల్​ - రేటు తెలిస్తే షాక్​ - COCK FIGHT IN AP

మొదలైన సంక్రాంతి హడావిడి - వేట ప్రారంభించిన పందెం రాయుళ్లు

Cock Fight in AP
Cock Fight in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 56 minutes ago

Cock Fight in AP :సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు. ఈ పందాల్లో కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు సర్వసాధారణం. కోడిపుంజు మెడమీద ఈకలు రెక్కించి ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే దృశ్యం పందెం రాయుళ్లకు కావాల్సినంత కిక్కిస్తుంది.

అందుకే పందెం రాయుళ్లు పుంజలను బరిలో దింపేదుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం లక్షలు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన కోళ్లకు నెల రోజులు శిక్షణ, పోషకాహారం ఇచ్చి బరికి సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుపు, నలుపు నెమళ్లు, డేగ, కాకిడేగ, అబ్రాసు, కొక్కిరాయి, పెట్టమారి తదితర పేర్లతో పిలిచేవాటికి గిరాకీ అధికంగా ఉందని పేర్కొంటున్నారు.

పెద్ద పందెపురాయుడు 25 నుంచి 30 పుంజులను బరిలో దింపడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక సాధారణ పందెపురాయుళ్లు తమ పెరడులో పెంచిన వాటినే సిద్ధం చేస్తుంటారు. రూ.లక్షల్లో పందెం కాచేవారు మాత్రం ఒంగోలు, ఏలూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు వెళ్లి మేలు జాతి పుంజులను తెచ్చుకుంటారు. పల్లెటూర్లలో ఒక్కో పుంజు రూ.10,00ల నుంచి రూ.20,000లు, ప్రత్యేక శిక్షణ, పోషణ పొందిన పందెపుకోళ్లు ఒక్కొక్కటి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి.

బాలింత కంటే భద్రంగా :పందెం కోళ్లకు నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, ఉడికించిన మటన్, జీడిపప్పు, రాగులు, సజ్జలు, బాదం తదితర ఆహారం పెడతారు. బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేతను తినిపిస్తారు. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి పట్టిస్తారు. బికాంప్లెక్స్‌ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి పెడతారు. స్నానానికి, తాగేందుకు వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణ కోసం నీళ్లలో వదిలి వారానికి ఒకసారి ఈత కొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు. చెప్పాలంటే వీటిని ఇంట్లో బాలింత కంటే భద్రంగా చూస్తారు.

ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు

కత్తులు దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు

Last Updated : 56 minutes ago

ABOUT THE AUTHOR

...view details