తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 7:39 PM IST

ETV Bharat / state

స్వీట్స్​ బాక్సుల్లో పెట్టి రాజస్థాన్​ నుంచి హైదరాబాద్​కు రూ.7 కోట్ల విలువైన హెరాయిన్​ - నలుగురి అరెస్ట్ - Huge drugs seized in hyderabad

Four Durg Peddlers Arrest : హైదరాబాద్​లో రూ.7 కోట్ల విలువైన హెరాయిన్​ను నార్కోటిక్​ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో హెరాయిన్​, నాలుగు సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​ నుంచి స్వీట్​ బాక్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్​లో అమ్మేందుకు ప్రణాళికలు రచించారు.

Four Durg Peddlers Arrest
Four Durg Peddlers Arrest (ETV Bharat)

RS 7 Crore Value Drugs Seized in Hyderabad : హైదరాబాద్​ మహానగరంలో రోజురోజుకూ మత్తు మాఫియా రెచ్చిపోతుంది. భాగ్యనగరాన్ని మాదక ద్రవ్యాల నిషేధ నగరంగా తీర్చాలన్న కలకు కొందరు మత్తుగాళ్లు తూట్లు పొడుస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం డ్రగ్స్​ తరలిస్తున్న నేరగాళ్లను, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా మహానగరంలో భారీ ఎత్తున హెరాయిన్​ను నార్కోటిక్స్​ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని శిల్పారామం సమీపంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్​, నాలుగు స్మార్ట్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అవినాశ్​ మహంతి మాట్లాడుతూ, శంషాబాద్​ ఎస్​వోటీ, మాదాపూర్​ పోలీసులతో కలిసి నార్కోటిక్​ బ్యూరో సహాయంతో స్పెషల్​ ఆపరేషన్​ నిర్వహించి నిందితులతో పాటు పెద్ద ఎత్తున హెరాయిన్​ను పట్టుకున్నామని వెల్లడించారు. ఈ నలుగురు నిందితులు రాజస్థాన్​కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. కిలో హెరాయిన్​ను నాలుగు ప్యాకెట్లలో ఒక్కొక్కటి 250 గ్రాములుగా ప్యాక్​ చేసి తీసుకువచ్చారని సీపీ వివరించారు.

రాజస్థాన్​ నాగౌర్​ జిల్లాకు చెందిన సంతోశ్​​ ఆచారి అనే వ్యక్తి ప్రస్తుతం జోధ్​పూర్​ జైలులో ఉన్నాడని, ఇతను జైలుకు వెళ్లేప్పుడు తన వద్ద ఉన్న హెరాయిన్​ను నేమి చందు అనే వ్యక్తికి ఇచ్చాడని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి చెప్పారు. నేమి చందు తన వద్ద ఉన్న హెరాయిన్​ను ఇతరులకు విక్రయించడానికి హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో నివాసం ఉంటున్న తన సోదరుడు అయాజ్​ భాటి వద్దకు వచ్చాడని తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారంగా నేవీ చందు మరో నిందితుడు నర్పత్​ సింగ్​ కిలో హెరాయిన్​ను రాజస్థాన్​ నుంచి స్వీట్స్​ మాటున బస్సులో హైదరాబాద్​కు తీసుకువచ్చారని సీపీ పేర్కొన్నారు.

అజయ్​ భాటితో పాటు చౌటుప్పల్​కు చెందిన హరీశ్​ సిర్విని కలిసి హైదరాబాద్​ నగరంలో హెరాయిన్​ను విక్రయించాలని ప్రణాళిక రచించి తీసుకువచ్చారని సీపీ అవినాశ్​ మహంతి వివరించారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్​ విక్రయించాలని చూస్తున్నారో కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారిస్తామన్నారు. జోధ్​పూర్​ జైలులో ఉన్న సంతోశ్​ ఆచారిని కూడా పీటీ వారెంట్​పై తీసుకువచ్చి విచారిస్తామని వెల్లడించారు. దేశ సరిహద్దుల ద్వారా డ్రగ్స్​ను ఇలాంటి వారు దిగుమతి చేసుకుంటున్నారని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి వివరించారు. అందరూ డ్రగ్స్​ అలవాటుకు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్​ వాడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌ - హైదరాబాద్​కు మత్తుపదార్థాలు ఎలా తీసుకొస్తున్నారంటే? - NARSINGI DRUGS CASE REMAND REPORT

అంతర్జాతీయ డ్రగ్స్​ సిండికేట్​ గుట్టురట్టు - నేరగాళ్ల సమాచారమిస్తే రూ.2 లక్షల రివార్డు - International Drugs Syndicate

ABOUT THE AUTHOR

...view details