ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నల్లమలలో పులుల సంచారం - సాంకేతికత పరిజ్ఞానంతో లెక్కింపు - TIGERS CENSUS IN NALLAMALA FOREST

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అడవిలో పెరిగిన పులుల సంచారం

Tigers Census In Nallamala Forest
Tigers Census In Nallamala Forest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2025, 8:56 AM IST

Tigers Census In Nallamala Forest:దేశవ్యాప్తంగా జంతు గణనకు అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగాపల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. గణన పక్కాగా చేపట్టేందుకు సాంకేతికతను వినియోగించనున్నారు. అటవీ ప్రాంతంలోని నీటి కుంట వద్దకు వచ్చిన పులుల దృశ్యాలు తాజాగా ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈనెల 10వ తేదీకే పులుల గణన ముగిసిందనీ, అయితే గతేడాది కంటే వాటి సంఖ్య మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. ట్రాప్‌ కెమెరాల్లో నమోదైన చిత్రాలు, పాదముద్రలు సేకరించామన్నారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details