Godavari Floating Restaurant: గోదావరి అందాలను వీక్షిస్తూ, రుచులను ఆస్వాదించేలా ఏపీ పర్యాటక శాఖ సౌజన్యంతో గోదావరి మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం ఇసుక తిన్నెల్లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ రెస్టారెంట్‌ని నిర్వహించనున్నారు. గోదావరి రుచులు ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆహ్లాదరకమైన వాతావరణంలో రెస్టారెంట్‌ని తీర్చిదిద్దారు. గతంలో కూడా ఈ విధంగా చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ల నుంచే మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. తాజాగా గోదావరికి అందాలకు తలమానికంగా నిలిచేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్:గోదావరి తీరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. రాజమహేంద్రవరం వద్ద ఉమా మార్కెండేయ స్వామి ఆలయం లాంచీల రేవు వద్ద ఇసుక తిన్నెల్లో ఏర్పాటైన రెస్టారెంట్‌ను మంత్రి దుర్గేష్, మ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలతో కలిసి ప్రారంభించారు.
ఫ్లోటింగ్ రెస్టారెంట్ విశేషాలు:
- పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన బోట్లలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గరకి చేరుకోవచ్చు
- ఉదయం 10 గంటల నుంచీ రాత్రి 10 గంటల వరకూ ఇది ఉంటుంది.
- లైవ్ కిచెన్‌లో అన్నీ కూడా వేడివేడిగా అప్పటికి అప్పుడే కుక్ చేసి అందిస్తారు
- బర్త్‌డే పార్టీలు, కిట్టీ పార్టీలకు 100 మంది వరకూ ఇందులో సెలబ్రేట్ చేసుకోవచ్చు
- దీని ద్వారా 70 మంది వరకూ ఉపాధి పొందుతారు
- ఇందులోని ధరలు కూడా సాధారణంగానే ఉంటాయి
- గోదావరి మధ్యలో అందాలను చూస్తూ, రుచులను ఆస్వాదించవచ్చు
- సంవత్సరంలో 11 నెలల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వరదల సమయంలో ఒడ్డుకి తీసుకునివస్తారు.
Floating Restaurant on Godavari River: పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుచీ పర్యాటక రంగంలో చాలా మార్పులు వచ్చాయి. పర్యాటకానికి పరిశ్రమ హోదా ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు సైతం అనేకం జరుగుతున్నాయి. గోదావరి ప్రాంత అభివృద్ధికి నిర్మాతలు ముందుకు రావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.
నీటిపై తేలియాడుతూ తినేద్దాం - ఎక్కడంటే?