Road Accident in Yadadri Bhuvanagiri District :తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు చెరువులో మునిగిపోవడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను వెలికితీశారు.
మృతులు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.